NTV Telugu Site icon

PM Modi: అమెరికా వెళ్లనున్న మోడీ.. క్వాడ్ సమావేశానికి హాజరు

Ustourmodi

Ustourmodi

ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21-23 మధ్య అమెరికాలో ప్రధాని మోడీ ఉండనున్నారు. క్వాడ్ మీట్‌లో మోడీ పాల్గొంటారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు

సెప్టెంబర్ 21న డెలావేర్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు. క్యాడ్ మీట్‌లో మోడీ పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో కూడా ప్రసంగిస్తారని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. డెలావేర్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. క్వాడ్ నాయకులు.. క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షించడానికి, భవిష్యత్తు ఎజెండాను సెట్ చేయనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు మరియు ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయం చేయడానికి రాబోయే సంవత్సరానికి ఎజెండాను నిర్దేశిస్తారు. తదుపరి క్వాడ్ సమ్మిట్‌ను భారత్ నిర్వహించనుంది.

ఇది కూడా చదవండి: Singer Mano Sons: మనో కూమారులు దాడి వెనుక కుట్ర.. బయటకు షాకింగ్ వీడియోలు

సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి.. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ప్రముఖ US ఆధారిత కంపెనీల CEOలతో కూడా మోడీ సంభాషించనున్నారు.

ఇది కూడా చదవండి: Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే?