NTV Telugu Site icon

Jairam Ramesh: రూపాయి పతనంపై మోడీ ఎందుకు స్పందించట్లేదు

Jairam Ramesh

Jairam Ramesh

రూపాయి విలువ ఈ మధ్య భారీగా పడిపోయింది. రూపాయి విలువ భారీగా క్షీణించింది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఏ పాలనలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ప్రధాని మోడీ ఎలా ప్రవర్తించారో గుర్తుచేస్తున్నామన్నారు. తాజాగా రూపాయి విలువ ఢమాల్ అయింది.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఇది కూడా చదవండి: TG News: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి.. మంత్రులు విజ్ఞప్తి

అమెరికా డాలర్‌తో పోలిస్తే మన దేశ రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దీనిపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని జైరాం రమేష్ అడిగారు. 2014లో ఇదే అంశంపై నాడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోడీ యూపీఏ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారన్నారు. యూపీఏ ప్రభుత్వం దేశ రక్షణ, రూపాయి విలువ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారని గుర్తుచేశారు. తాజా పతనంపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని అడిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ క్షీణత విషయంలో ప్రధాని మోడీ దగ్గర ఎలాంటి మాటలు లేనట్లుగా అనిపిస్తోందన్నారు. కేవలం కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే ఆలోచిస్తున్నారని జైరాం రమేష్ విమర్శించారు.

ఇది కూడా చదవండి: Nitesh Rane: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలిచారు.. మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Show comments