Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా నిర్ధారిస్తారు.. అంతర్జాతీయ కథనాలపై యూనియన్లు మండిపాటు

Ahmedabadplanecrash

Ahmedabadplanecrash

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు వెలువడుతున్నాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. చనిపోయిన వారిని దూషించొద్దని కోరాయి. ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని.. పారదర్శకత కోసం పిలుపునిస్తున్నట్లు తెలిపాయి. దయచేసి ఎవరిని బలిపశువులను చేయొద్దని కోరాయి. పైలట్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వస్తున్న మీడియా కథనం పట్ల తీవ్రంగా కలత చెందినట్లు ఎయిర్ ఇండియాలో నారో-బాడీ పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐసీపీఏ తెలిపింది. నిశ్చయాత్మక ఆధారాలు లేకుండా పైలట్లను నిందించడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Exclusive : బాహుబలి రీరిలీజ్.. రన్ టైమ్ కోసం రంగంలోకి రాజమౌలి

అయితే ప్రాథమిక నివేదికలో టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. రెండు ఇంజిన్ ఇంధన స్విచ్‌లు ఆపివేయబడ్డాయని తెలిపింది. 15 పేజీల ప్రాథమిక నివేదికలో సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సూచించింది. అయితే ప్రమాదం జరిగిన విమానంలో ఇంధన స్విచ్‌లను ఎయిరిండియా రెండు సార్లు మార్చినట్లు సమాచారం. అంటే రెండు స్విచ్‌లు కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయని తెలుస్తోంది. అయితే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొక పైలట్‌ను ‘‘నువ్వు ఎందుకు కట్ చేశావు?’’ అని అడుగుతున్నట్లు రికార్డైంది. మరొక పైలట్ ‘‘నేను చేయలేదు’’ అని ప్రతి స్పందించినట్లు తెలుస్తోంది. అంటే పైలట్ల మధ్య ఏదో గందరగోళం నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్య చర్యతో రెండు ఇంధన స్విచ్‌లు ఆపేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Sreeleela : రెమ్యూనరేషన్ హైక్‌తో.. షాక్ ఇచ్చిన శ్రీ లీల !

ఇంధన స్విచ్ ఆఫ్‌పై వస్తున్న నిందను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక రాకుండానే ఎలా కథనాలు ప్రసారం చేస్తారంటూ నిలదీస్తున్నాయి. తుది నివేదిక వచ్చాక అప్పుడు అంగీకరిస్తామని పైలట్ సంఘాలు పేర్కొన్నాయి. అప్పుటి వరకు ఎలాంటి తప్పుడు కథనాలు ప్రచురించొద్దని.. ప్రజలను గందరగోళానికి నెట్టొద్దని కోరుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రాథమిక నివేదికను వైట్‌సైట్‌లో ఉంచారు. కానీ దానిపై ఎవరూ సంతకం చేయలేదు. పారదర్శకతను కోరుకుంటున్నామని.. దర్యాప్తు ప్యానెల్‌లో తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతున్నట్లు పైలట్ సంఘాలు స్పష్టం చేశాయి.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.

Exit mobile version