Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియాకు పైలట్ల సంఘం లీగల్ నోటీసు.. ఏముందంటే..!
- అంతర్జాతీయ మీడియాకు పైలట్ల సంఘం లీగల్ నోటీసు
- ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌లకు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్‌నే కారణమంటూ అంతర్జాతీయ మీడియా ఊదరగొట్టింది. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిందంటూ వార్తలు వండి వార్చాయి. అయితే ఈ కథనాలను మొట్టమొదటి నుంచి పైలట్ సంఘాలు ఖండిస్తూనే ఉన్నాయి. తుది రిపోర్ట్ రాక ముందే ఎలా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారంటూ యూనియన్లు మండిపడ్డాయి. తాజాగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌లకు పైలట్ సంఘాలు లీగల్ నోటీసులు పంపించాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: Tamil Nadu: తమిళనాడులో అరుదైన నల్ల చిరుత ప్రత్యక్షం
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
పాశ్చాత్య మీడియాతో ప్రాథమిక నివేదికను తప్పుగా అర్థం చేసుకుందని పైలట్ సంఘాలు ధ్వజమెత్తాయి. ఇదిలా ఉంటే మీడియా కథనాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్‌టీఎస్‌బీ కూడా తీవ్రంగా ఖండించింది. ఊహాజనిత కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో పైలట్ సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ మీడియా క్షమాపణ చెప్పాలని యూనియన్లు కోరారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్‌లకు లీగల్ నోటీసు జారీ చేసింది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో.. పైలట్‌ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్-ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడు అని ప్రాథిమక నివేదిక తెలిపింది. అయితే విమానంలో 11A దగ్గర కూర్చున్న ప్రయాణీకుడు విశ్వాష్‌కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులతో మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని పేర్కొన్నాడు. క్రాష్ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా రమేష్ తెలిపాడు. కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు. ఇక విమానం కూలిపోక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అదే 3,600–4,900 అడుగుల ఎత్తులో ఉంటే మాత్రం విమానం ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించొచ్చు. అందువల్లే పైలట్లకు సాధ్యం కాలేదు.
ఇది కూడా చదవండి: Amit Shah: 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించండి.. అథ్లెట్లకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించిన అమిత్ షా
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
Statement from NTSB Chairwoman Jennifer Homendy:
“Recent media reports on the Air India 171 crash are premature and speculative. India’s Aircraft Accident Investigation Bureau just released its preliminary report. Investigations of this magnitude take time. We fully support the…— NTSB Newsroom (@NTSB_Newsroom) July 18, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!