Site icon NTV Telugu

Chhattisgarh: ఆస్పత్రిలో నర్సును కట్టేసి గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్

Chhattisgarh

Chhattisgarh

physical assault on nurse In Chhattisgarh: మరో మహిళపై అత్యాచారం జరిగింది. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ ఆరోగ్య కేంద్రంలోనే నర్సపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. నలుగురు వ్యక్తులు నర్సును కట్టేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్దారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉన్నాడు. ఈ ఘటనలో మైనర్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. పోలీసులు నాలుగో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నలుగురు నిందితులు అత్యాచారం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also: Says Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు చెప్పులు వేసుకోను

మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంలో నర్సు ఒంటరిగా ఉండటాన్ని నలుగురు గమనించి అత్యాచారం చేయాలని భావించారు. ఈ క్రమంలో ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లిన నిందితులు ఒంటరిగా ఉన్న నర్సును కట్టేసి, గొంతును బిగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న నర్సు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీఎం భూపేష్ భగేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మహిళలకు రక్షణ ఇవ్వడం లేదని బీజేపీ విమర్శించింది. ఈ ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల సిబ్బందికి ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు రక్షణ కావాలని.. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని.. అప్పటి వరకు మేం పని చేయమని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.

అంతకుముందు జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాగే ఓ యువతిపై 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ రైడ్ కోసం సరదాగా స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలిని, అతని స్నేహితుడిని కొట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుపై జార్ఖండ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు.

Exit mobile version