NTV Telugu Site icon

Tamil Nadu: మైనర్ బాలికపై లైంగిక దాడి.. మత్తు మందు ఇచ్చి బ్లాక్‌మెయిల్

Physical Assault On Minor Girl In Tamil Nadu

Physical Assault On Minor Girl In Tamil Nadu

Physical assault on minor girl in Tamil nadu: తమిళనాడులో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికకు నరకం చూపించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేసింది ఆమెకు బంధువే. బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Read Also: Qualcomm Snapdragon 8 Gen 2 SoC: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్‌సెట్ ఆవిష్కరణ.. కొత్త చిప్‌సెట్ రాబోతున్న ఫోన్లు ఇవే..

వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి ఆమె బంధువుతో పాటు మరో నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక సంవత్సరం పాటు ఈ అఘాయిత్యానికి సంబంధించి వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 2021 ఏప్రిల్ నెలలో మైనర్ బాలిక బంధువుల అయిన రంగనాథ్ బైకుపై ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. రంగనాథ్ బాలికపై లైంగికదాడికి పాల్పడి దాన్ని ఆ ఫోన్ లో రికార్డ్ చేసి, తన నలుగురు స్నేహితులకు ఫోన్ చేశాడు. ఈ వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ.. నలుగురు పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అయితే అమ్మాయి ప్రవర్తన చూసిన తల్లిదండ్రులు ఇటీవల తిరుచ్చిలోని ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే బాలల హక్కుల సంఘం ఈ విషయం తెలియడంతో ముసిరి పోలీసులకు సమాచారం అందించి బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో వాట్సాప్ లో లైంగిక వేధింపుల వీడియో వైరల్ గా మారింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ముసిరి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగనాథ్ స్నేహితుల్లో ఒకరు ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేయడంతో రంగనాథ్, అతని స్నేహితులకు మధ్య గొడవ జరిగిందని విచారణలో తేలింది. బాలిక ఫిర్యాదు మేరు రంగనాథన్, మణికందన్, గణేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Show comments