NTV Telugu Site icon

Kolkata: మైనర్ బాలికపై కొడుకు అత్యాచారం.. సహకరించిన తల్లి..

Kolkata

Kolkata

Physical assault on minor girl: దేశంలో అత్యాచార ఘటనలు రోజుకు ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. మృగాళ్లు తమ కామాన్ని తీర్చుకునేందుకు బాలికలు, మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పటికీ.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. అయితే ఈ తరహా కేసుల్లో బయటకు వస్తున్నవి కొన్నే. కొంతమంది పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు.

Read Also: Cell Phone: సెల్‌ ఫోన్‌ చిచ్చు.. కూతురుని గొంతు నులిమి చంపిన తండ్రి

కోల్‌కతాలో దారుణం జరిగింది. కొడుకుకు తప్పొప్పులు చెప్పాల్సిన కన్న తల్లే కొడుకు నేరానికి సహకరించింది. మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చింది సదరు మహిళ. ఆ తరువాత కొడుకు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక, నిందితురాలికి తెలుసు. ఇంటికి ఆహ్వానించి మత్తు మందు ఇచ్చింది. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగింది. అయితే ముందుగా బాలిక పోలీసులకు చెప్పేందుకు భయపడింది. అయితే స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు తల్లికొడుకులను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాలిక, నిందితురాలు అయిన మహిళతో కలిసి బ్యూటీషియన్ కోర్సు చేస్తోంది. అక్టోబర్ లో బాలికను మహిళ తన నివాసానికి ఆహ్వానించింది. డ్రగ్స్ కలిపిన ఆహారం తినిపించడంతో బాలిక స్పృహ కోల్పోయింది. ఆ తరువాత మహిళ కొడుకు ఆమెపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రాణాలతో బయటపడిన బాలిక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. తల్లీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Show comments