Physical assault on Kerala model: కేరళలో దారుణం జరిగింది. 19 ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు యువకులతో పాటు ఒక మహిళను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్లాన్ ప్రకారం యువ మోడల్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కొడంగల్లూర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కాసర్ గోడ్ కు చెందిన యువతిపై కారులో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Read Also: Big News : కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి
కొచ్చి నగరంలోని కక్కనాడ్ ప్రాంతంలో ఉంటున్న బాధితురాలిని ఆమె స్నేహితురాలు రాజస్థాన్ కు చెందిన యువతి ఓ డీజే పార్టీకి ఆహ్వానించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న యువకులతో బాధిత యువతికి పరిచయం ఏర్పడింది. పార్టీలో భాగంగా మద్యం తాగిన యువతిని నిందితులు తమ వాహనంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత కక్కనాడ్ ప్రాంతంలో పారేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. బాధితురాాలు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం బాధితురాలని ఆమె రూమ్‌మేట్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచార ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే బాధిత యువతి స్నేహితురాలితోె సహా.. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.