NTV Telugu Site icon

Tejas Jet: తేజస్ క్రేజ్ మామూలుగా లేదు.. కొనేందుకు ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ ఆసక్తి

Tejas Jets

Tejas Jets

Tejas Jet: ఇండియాలో తయారవుతున్న తేజస్ యుద్ధవిమానాలకు భారీగా క్రేజ్ ఏర్పంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తు్న్నాయి. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియాలోనే తయారవుతోంది. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL) ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది.

అయితే ఫిలిప్పీన్స్, నైజీరియా, అర్జెంటీనా, ఈజిప్టు దేశాలు తేజస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ సీబీ అనంతకృష్ణన్ బుధవారం తెలిపారు. కొనుగోళ్లకు సంబంధించి ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. యూకే నుంచి కొన్ని విమాన భాగాలకు సంబంధించి కొనుగోళ్లు ఫలవంతమైంతే అర్జెంటీనాకు తేజస్ జెట్లను సరఫరా చేయడానికి భారత్ ముందుకు సాగుతుందని చెప్పారు.

1982 ఫాక్లండ్స్ యుద్ధం తర్వాత యూకే, అర్జెంటీనాకు సైనిక విక్రయాలపై ఆంక్షలు విధించింది. యూకే నుంచి తయారైన హార్డ్‌వేర్ ఉన్న వస్తువులను ఆ దేశానికి విక్రయించడాన్ని కూడా నిరోధిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి సేకరించిన మిలిటరీ హార్డ్ వేర్ కలిగిన తేజస్ యుద్ధ విమానాలను అర్జెంటీనాకు విక్రయించడం సమస్యగా మారింది.

Read Also: Hamas: పాకిస్తాన్ “ముజాహిదీన్” భూమి.. మీరే ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలరు.. హమాస్ నేత కీలక వ్యాఖ్యలు..

HAL, ఇటీవల అర్జెంటీనా వైమానిక దళంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ దేశానికి చెందిన టూ టన్ క్లాస్ హెలికాప్టర్ విడిభాగాలు, వాటికి సంబంధించిన సేవలను అందించడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. ఇదిలా ఉంటే చైనా ముప్పును ఎదుర్కొనేందుకు ఫిలిప్పీన్స్ ఇటీవల భారత మిలిటరీ వస్తువులపై ఆధారపడుతోంది. ఇప్పటికే ఈ దేశం బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం చేసుకుంది. గత కొన్నేళ్లుగా భారత్-ఫిలిప్పీన్స్ మధ్య రక్షణ సంబంధాలు పెరిగాయి.

తేజస్ యుద్ధ విమాన విషయానికి వస్తే ఇది సింగిల్ ఇంజన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇది ప్రమాదకర ఎయిర్ ఇన్విరాన్మెంట్‌లో పనిచేయగలదు. ఇది వైమానిక రక్షణ, సముద్ర నిఘా, స్ట్రైక్ రోల్స్ చేపట్టేందుకు రూపొందించబడింది. తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కి ప్రధాన ఆధారం కానుంది. ఇది ఇప్పటికే దాదాపు 40 తేజస్ ప్రారంభ వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 2021లో, రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం 83 తేజస్ MK-1A జెట్‌ల కొనుగోలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ₹ 48,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. గత నెలలో, IAF కోసం 97 తేజస్ జెట్‌ల అదనపు బ్యాచ్‌ను కొనుగోలు చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రాథమిక ఆమోదం తెలిపింది.

Show comments