Tejas Jet: తేజస్ క్రేజ్ మామూలుగా లేదు.. కొనేందుకు ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejas Jet: ఇండియాలో తయారవుతున్న తేజస్ యుద్ధవిమానాలకు భారీగా క్రేజ్ ఏర్పంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తు్న్నాయి. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియాలోనే తయారవుతోంది. హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL) ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది.
అయితే ఫిలిప్పీన్స్, నైజీరియా, అర్జెంటీనా, ఈజిప్టు దేశాలు తేజస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ సీబీ అనంతకృష్ణన్ బుధవారం తెలిపారు. కొనుగోళ్లకు సంబంధించి ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. యూకే నుంచి కొన్ని విమాన భాగాలకు సంబంధించి కొనుగోళ్లు ఫలవంతమైంతే అర్జెంటీనాకు తేజస్ జెట్లను సరఫరా చేయడానికి భారత్ ముందుకు సాగుతుందని చెప్పారు.
Also Read
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
1982 ఫాక్లండ్స్ యుద్ధం తర్వాత యూకే, అర్జెంటీనాకు సైనిక విక్రయాలపై ఆంక్షలు విధించింది. యూకే నుంచి తయారైన హార్డ్‌వేర్ ఉన్న వస్తువులను ఆ దేశానికి విక్రయించడాన్ని కూడా నిరోధిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి సేకరించిన మిలిటరీ హార్డ్ వేర్ కలిగిన తేజస్ యుద్ధ విమానాలను అర్జెంటీనాకు విక్రయించడం సమస్యగా మారింది.
Read Also: Hamas: పాకిస్తాన్ “ముజాహిదీన్” భూమి.. మీరే ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలరు.. హమాస్ నేత కీలక వ్యాఖ్యలు..
HAL, ఇటీవల అర్జెంటీనా వైమానిక దళంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ దేశానికి చెందిన టూ టన్ క్లాస్ హెలికాప్టర్ విడిభాగాలు, వాటికి సంబంధించిన సేవలను అందించడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది. ఇదిలా ఉంటే చైనా ముప్పును ఎదుర్కొనేందుకు ఫిలిప్పీన్స్ ఇటీవల భారత మిలిటరీ వస్తువులపై ఆధారపడుతోంది. ఇప్పటికే ఈ దేశం బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం చేసుకుంది. గత కొన్నేళ్లుగా భారత్-ఫిలిప్పీన్స్ మధ్య రక్షణ సంబంధాలు పెరిగాయి.
తేజస్ యుద్ధ విమాన విషయానికి వస్తే ఇది సింగిల్ ఇంజన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇది ప్రమాదకర ఎయిర్ ఇన్విరాన్మెంట్‌లో పనిచేయగలదు. ఇది వైమానిక రక్షణ, సముద్ర నిఘా, స్ట్రైక్ రోల్స్ చేపట్టేందుకు రూపొందించబడింది. తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కి ప్రధాన ఆధారం కానుంది. ఇది ఇప్పటికే దాదాపు 40 తేజస్ ప్రారంభ వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 2021లో, రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం 83 తేజస్ MK-1A జెట్‌ల కొనుగోలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ₹ 48,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. గత నెలలో, IAF కోసం 97 తేజస్ జెట్‌ల అదనపు బ్యాచ్‌ను కొనుగోలు చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రాథమిక ఆమోదం తెలిపింది.
- Tags
- Argentina
- Egypt
- HAL
- IAF
- Philippines
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!