NTV Telugu Site icon

Rs.2,000 Notes: రూ.2000 నోట్లకు రెండేళ్ల గడువు..! రద్దు చేయండి..

Sushil Kumar Modi

Sushil Kumar Modi

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎప్పుడు ఏ నోట్లను రద్దు చేస్తారు? అనే టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది.. కొన్ని నోట్ల ముద్రణ ఆగిపోయినా..? మార్కెట్‌లో కనిపించకపోయినా? ఏమైంది? ఏదో జరగబోతోంది? అవి కూడా రద్దు చేస్తారా? అనే ప్రచారం సాగుతూ వస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభలో ఇవాళ మోడీ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఈ పెద్ద నోట్లు ఉన్నవారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.. ఇప్పటికే ఏటీఎంల నుంచి రూ.2వేల నోట్లు రావడం లేదని.. త్వ రలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పుకొచ్చారు.. ఇక, కేంద్ర ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు సుశీల్‌ కుమార్‌ మోడీ.

Read Also: Single Cigarettes Sales Ban: పొగరాయుళ్లకు బిగ్‌ షాక్‌.. ఇక, ఇలా అమ్మలేరు.. తాగలేరు..!

జీరో-అవర్‌లో పెద్ద నోట్ల వ్యవహారాన్ని లేవనెత్తిన ఆయన, దేశంలోని చాలా ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లు మాయమయ్యాయని, అవి త్వరలో చట్టబద్ధం కాకపోవచ్చునని పుకార్లు ఉన్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని, మూడేళ్ల క్రితమే 2000 రూపాయల కరెన్సీ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసిందన్నారు సుశీల్‌ మోడీ.. కాగా, 2016లో ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేసి.. వాటి స్థానంలో
కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చా రు. కానీ, రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదంటున్నారు బీజేపీ ఎంపీ సుశీల్‌ మోడీ.. 1,000 రూపాయల నోటు చలామణిని నిలిపివేసినప్పుడు 2,000 రూపాయల నోటు తీసుకురావడానికి ఎటువంటి లాజిక్ లేదన్నారు.. ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లు లేని అభివృద్ధి చెందిన దేశాల ఉదాహరణలను ఉదహరించిన ఆయన.. 2,000 రూపాయల నోట్లను నిల్వ ఉంచడంతోపాటు డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ వ్యాపారాల్లో తరచుగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన 2000 రూపాయల నోటు నల్లధనానికి పర్యాయపదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్రమంగా 2000 రూపాయల నోటును రద్దు చేయాలి. పౌరులు తమ వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి 2 సంవత్సరాల సమయం ఇవ్వాలని సూచించారు బీజేపీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోడీ.