Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాల్లో సంక్షోభం
- పొదుపు మంత్రం పాటించాలని పౌరులకు మోడీ పిలుపు
- పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చని వదంతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. పౌరులంతా పొదుపు పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక వాహనదారుల్లో భయాందోళనలు కూడా మొదలయ్యాయి. భారీగా పెరగవచ్చన్న వదంతులతో మరోసారి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు పెరిగాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అనేక నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొందరు వినియోగదారులు ట్యాంకులు పూర్తిగా నింపించుకునేందుకు పోటీపడగా.. మరికొన్ని ప్రాంతాల్లో “నో ఫ్యూయల్”, “నో స్టాక్” బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.
Also Read
ఇంధన ధరలు లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు పెరగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై పెరుగుతున్న భారం, ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి, పెరుగుతున్న దిగుమతి బిల్లు కారణంగా త్వరలో ధరల పెంపు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లోని అల్వార్‌లో అనేక పెట్రోల్ బంకుల దగ్గర “నో పెట్రోల్”, “నో డీజిల్” బోర్డులు కనిపించాయి. వినియోగదారులు పెట్రోల్ ధరలు రూ.5 నుంచి రూ.15 వరకు, డీజిల్ ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
భువనేశ్వర్‌లో మాత్రం పెట్రోల్ బంక్ యజమానులు ఇవన్నీ కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. అయితే ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంగీకరించారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?