దాదాపు ఐదు నెలల విరామం తర్వాత పెట్రో ధరలు మళ్లీ పైకి కదులుతున్నాయి… వరుసగా రెండు రోజులు పెరిగిన పెట్రో ధరలు.. నిన్న మాత్రం స్థిరంగా ఉండగా.. ఇవాళ మళ్లీ వడ్డించాయి ఇంధన సంస్థలు.. లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంచేశాయి.. దీంతో ఈ వారంలో పెట్రో ధరలు మూడోసారి పెరిగినట్టు అయ్యింది.. ఇక, తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.01 నుంచి రూ.97.81కి పెరగగా.. డీజిల్ ధర లీటరుకు రూ.88.27 నుంచి రూ.89.07కి పెరిగింది.. కాగా, మార్చి 23 మరియు మార్చి 24 తేదీలలో, చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతూ.. నాలుగున్నర నెలల ఎన్నికల సంబంధిత విరామానికి ముగింపు పలికాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, ముంబైలో పెట్రోల్ ధర 84 పైసలు పెరిగి రూ.112.51కి చేరుకోగా, చెన్నైలో 76 పైసలు పెరిగి రూ.103.67కి పెరిగింది.. కోల్‌కతాలో 84 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.106.34 నుంచి రూ.107.18కి ఎగిసింది.. ఇక, డీజిల్ ధర 85 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ రూ. 96.70గా అమ్ముతున్నారు.. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71కి చేరాయి.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున వడ్డించారు.. దీంతో పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు వడ్డించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఈ నేపథ్యంలోనే వరుసగా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు.. ఇక, స్థానిక పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఒక్కో విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.