Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు అలహాబాద్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆధారాలు ఉన్నట్లు పిటిషనర్ ఆరోపించారు. గతంలో వీఎస్ఎస్ శర్మ చేసిన విచారణలో యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈమెయిళ్లను ఉదహరించారు.
Read Also: Supreme Court: ‘‘మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లా..?’’ కేఏ పాల్ పిటిషన్‌పై ఆగ్రహం..
రాహుల్ గాంధీ పౌరసత్వంపై సమాచారం కోసం శర్మీ 2022లో యూకే అధికారులను సంప్రదించారు. యూకే ప్రభుత్వం కొన్ని వివరాలను ధృవీకరించినట్లు నివేదించబడినప్పటికీ, డేటా రక్షణ చట్టాలు, రాహుల్ గాంధీ అధికారిక లేఖ లేకపోవడంతో పూర్తి సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించింది. ఈ కేసుపై నవంబర్ 25 డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే, ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాక స్వీకరించినట్లు, దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ లోగా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని జస్టిస్ అట్టౌ రెహమాన్ మసూది, జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, ఏ వ్యక్తి కూడా భారత పౌరసత్వాన్ని మరియు మరొక దేశం యొక్క పౌరసత్వాన్ని ఏకకాలంలో కలిగి ఉండకూడదు. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ పరిశీలనలో ఉండగా, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కూడా ఇదే పిటిషన్ దాఖలు చేశారు. అలహాబాద్ హైకోర్టు విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కేసును విచారిస్తామని ఢిల్లీ కోర్టు సూచించింది.