NTV Telugu Site icon

Rahul Gandhi: పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు.. కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కేంద్రం!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మోడీ సర్కార్ కుంభకర్ణుడిలా నిద్ర పోతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. అయితే, ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అందులో, ఇటీవల గిరినగర్‌లోని కూరగాయల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. అక్కడ సామాన్యులతో ధరల పెరుగుదలపై ప్రధానంగా చర్చలు జరిపారు. అలాగే, దాని వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరలు పెరగడంతో ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సామాన్య ప్రజలు వెల్లడించారు.

Read Also: JPC First Meeting: జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం..

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తెలిపారు. అయితే, చిన్న చిన్న విషయాలకు సామాన్య ప్రజలు రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. గతంలో 40 రూపాయలు ఉండే కిలో వెల్లుల్లి ప్రస్తుతం రూ.400 అమ్ముతున్నారని తెలిపారు. ఇలా ధరలు పెరగడంతో పేద ప్రజలు ఇంక పొదుపు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యుడి వంట గది బడ్జెట్‌ భారీగా పెరిగిపోతుందన్నారు. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కుంభకర్ణుడిలా నిద్రపోతోందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

Show comments