Site icon NTV Telugu

BJP: “క్యాంపస్‌లో బహిరంగ మూత్ర విసర్జన చేశాడు”.. కన్హయ్య కుమార్‌పై బీజేపీ విమర్శలు..

Kanhaiya Kumar

Kanhaiya Kumar

Peeing in open on campus, BJP targets Kanhaiya Kumar over urinating incident: ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశంలో విమానయాన రంగంలో సంచలనంగా మారింది. డీజీసీఏ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎయిర్ లైన్స్ సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే జవహర్‌లాల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడని చెబుతూ ప్రస్తుతం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

Read Also: Delhi Accident Case: అసలు ట్విస్ట్ అంటే ఇది.. డ్రగ్స్ కేసులో అంజలి ఫ్రెండ్ అరెస్ట్?

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ 2015లో జెఎన్‌యూలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ప్రస్తుతం మనం పీగేట్ వివాదంలో ఉన్నాము.. రాహుల్ గాంధీ తర్వాత(జైరాం రమేష్ ప్రకటించనట్లు) అత్యంత ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశారని.. కాంగ్రెస్ నేతల్లో అలాంటి ప్రతిభ ఉంది’’ అంటూ మాలవీయ ట్వీట్ చేశారు.

2015లో కన్హయ్య కుమార్ విద్యార్థి సంఘం నాయకుడిగా లేని సమయంలో జెఎన్‌యూలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయాన్ని వ్యతిరేకించినందకు తనపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించాడని జెఎన్‌యూ విద్యార్థిని పేర్కొంది. కన్హయ్య కుమార్ తప్పుడు ఉద్యమకారుడు అని.. ఈ ఘటన తర్వాత కన్హయ్యకు జరిమానా విధించినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే.. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్), కన్హయ్య ప్రాతినిధ్యం వహించిన సంఘం, ఈ ఆరోపణలను కొట్టిపారేసింది . అతని ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొంది. సీపీఐ నాయకుడిగా ఉన్న కన్హయ్య కుమార్ 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

Exit mobile version