ప్రధాని మోడీ నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లగా అక్కడి రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మోడీ కాన్వాయ్‌కి అడ్డంగా సుమారు 15 నిమిషాల పాటు రైతులు నిరసన తెలపడంతో, మోడీ తిరిగి వెళ్లిపోయారు. అయితే దీనిపై పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సైటెర్లు వేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దులో రైతులు నిరసన తెలిపారన్నారు.
కానీ ప్రధాని మోడీ వారి కోసం 15 నిమిషాలు కూడా ఆగలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశానని ప్రధాని చెబుతున్నారని, ప్రధానికి చెప్పినదానికి భిన్నంగా పరిస్థితి ఉందని ఆయన అన్నారు. రైతులను మోడీ నిండా ముంచారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీ మరోసారి పంజాబ్ పర్యటన చేయాలంటూ కోరారు.
