కరోనా సమయంలో బీహార్ లో మరణాల లెక్కలు భయపెడతున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ కావడంతో మరణాల లెక్కలను సవరించింది. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఇప్పటికీ లెక్కలోకి రాని మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలోకి రాని మరణాలపై మరోసారి పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు దాదాపుదల 2.2లక్షల మంది మరణించారు. ఇందులో 75 వేలకు పైగా మరణాలు ఏ కారణంగా మరణించారో అర్ధంగాని తెలియని పరిస్థితి.
Read: ఒక్కరోజులో 10 అంతస్థుల భవనం నిర్మాణం… ఎలా అంటే…
బీహార్‌లో ఇప్పటివరకు కరోనాతో 7,717 మంది మృతి చెందారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక కరోనా మరణాలకు 10 రెట్లు ఎక్కువగా అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. వీటి సంగతేంటో తెల్చాలని పాట్నా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు మధ్యప్రదేశ్, ఏపీ, తమిళనాగు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి మొత్తం 4.8 లక్షల అనుమానాస్పద మరణాలు సంభవించాయని ఇటీవలే ఓ జాతీయ మీడియా సర్వే నివేదికలో తేలింది. ఈ అనుమానాస్పద మరణాలు అన్ని కరోనా మరణాలేనా లేదంటే వేరువేరు కారణాల వలన సంభవించినవా అన్నది తేలాల్సి ఉన్నది.
