Site icon NTV Telugu

Delhi: పాక్, ఆప్ఘనిస్థాన్ మైనార్టీలకు గుడ్‌న్యూస్.. పాస్‌పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన

Caa

Caa

ముస్లిం దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన మైనారిటీలకు కేంద్ర హోంశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన మైనారిటీ వర్గాలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండటానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. డిసెంబర్ 31, 2024 వరకు భారతదేశానికి వచ్చిన వారందరికీ వర్తిస్తుందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!

గత సంవత్సరం అమల్లోకి వచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) ప్రకారం.. డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన మైనారిటీల సభ్యులందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది. ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. 2014 తర్వాత భారతదేశానికి వలస వచ్చిన ప్రజలకు.. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులకు ఉపశమనం కలిగించనుంది. పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలనే నియమం నుంచి మినహాయింపు ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు

Exit mobile version