NTV Telugu Site icon

Parvesh Varma: ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ.. అమిత్ షాతో భేటీ..

Parvesh Verma

Parvesh Verma

Parvesh Varma: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అగ్రనేతల్ని ఓడించి మరీ ఢిల్లీని కైవసం చేసుకుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 చోట్ల బీజేపీ, 22 చోట్ల ఆప్ విజయం దాదాపు గా ఖరారైంది. ఇదెలా ఉంటే, ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలయ్యారు. న్యూ ఢిల్లీ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయనకు, బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చారు. కొన్ని రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. చివరకు కేజ్రీవాల్‌ని ఓడించారు.

Read Also: Manish Sisodia: మనీష్ సిసోడియా ఓటమి..

అయితే, ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ తదుపరి ఢిల్లీ షీఎం అవుతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఆయనే ముందు వరసలో ఉన్నారు. విజయం తర్వాత కేంద్రం హోంమంత్రి అమిత్‌షా పర్వేష్ వర్మ భేటీ అయ్యారు. మాజీ సీఎం సాహెబ్ సింగ్ కుమారుడిగా పర్వేష్ వర్మకు మంచి పేరుంది.

మరోవైపు, న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆయన, కేజ్రీవాల్‌ ప్రచారాన్ని ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. పర్వేష్ వర్మ జోరుతో కేజ్రీవాల్ ఎక్కువగా తన విజయం కోసమే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిది. ఢిల్లీలోని మిగతా ఆప్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయడానికి ఎక్కువగా సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడేలా, బీజేపీ వ్యూహా రచన చేసి సక్సెస్ అయింది.