NTV Telugu Site icon

Parliament Sessions: పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసిన అదానీ ఇష్యూ.. ఎల్లుండికి వాయిదా

Lok Sabha

Lok Sabha

Parliament Sessions: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటకే ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. అయితే, ఇటీవల మరణించిన సభ్యులకు ఎంపీలు సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, అవినీతి ఆరోపణలపై ప్రస్తావించారు. అదానీ అవినీతి యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఈ విషయంలో అదానీకి ప్రధాని మోడీ సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదానీ అంశంపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించడంతో.. అందుకు విపక్ష సభ్యులు ససేమిరా అనడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా పడింది.

Read Also: Eye Care: కళ్లను రుద్దు తున్నారా.. ఇన్ఫెక్షన్ కు దారి తీసే అవకాశం..

ఇక, వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్ సభలోనూ అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఇండియా కూటమి సభ్యులు పట్టుబట్టడంతో.. స్పీకర్ ఓం బిర్లా సభను ఎల్లుండి (బుధవారం)కి వాయిదా వేశారు. ఉభయ సభలను అదానీ అవినీతి అంశం ఒక్కసారిగా కుదిపేసింది. అదానీ అంశంపై చర్చించాల్సిందేనని విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో.. ఉభయ సభలు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో తొలిరోజు శీతాకాల పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమైన గంటకే వాయిదా పడ్డాయి.