Site icon NTV Telugu

Khalistani Terrorist: పార్లమెంట్‌పై దాడి పన్నూ పనేనా..?

Khalistani Terrorist

Khalistani Terrorist

Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కాలంలో భారత్‌ని బెదిరిస్తూ పలు వీడియోల్లో కనిపిస్తున్నాడు. ఇటీవల భారత పార్లమెంట్ పునాదులు కదిలిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఆ వీడియోలో హెచ్చరించాడు. డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్‌పై లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన అప్జల్ గురు ఫోటోను వెనకాల పెట్టుకుని, గురుపత్వంత్ సింగ్ భారత్‌ని హెచ్చరించిన వీడియో వైరల్ అయింది.

Read Also: Jammu Kashmir: ఆర్టికల్ 370 తీర్పుపై “ఇస్లాం దేశాల గ్రూప్” అవాకులు.. ఘాటుగా స్పందించిన భారత్..

అయితే, ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ స్పందించింది. కొందరు వ్యక్తులు మీడియాలో సస్సేషన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. ఈ విషయాన్ని యూఎస్, కెనడా అధికారులతో పంచుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే పన్నూ హెచ్చరించిన డిసెంబర్ 13 రోజునే, ఈ రోజు నలుగురు ఆగంతకులు భారత్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారు. భద్రతను ఉల్లంఘించి ఇద్దరు పార్లమెంట్ హౌజులో ఎల్లో కలర్ డబ్బాలను విసిరారు. దీంతో పార్లమెంట్‌ ఉక్కసారిగా ఉలిక్కిపడింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే, తాజా ఘటనలో ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూకు ఏమైనా సంబంధం ఉందనే దిశగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతను ఖలిస్తాన్ ఉద్యమం పేరిట కెనడా, అమెరికాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఇతని హత్యకు భారత్ కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా గడ్డపై, అమెరికా పౌరుడిని హతమార్చే కుట్రను అడ్డుకున్నట్లు తెలిపింది. దీనిపై భారత్‌కి అత్యున్నత స్థాయిలో తన ఆందోళనను తెలియజేసింది. ఈ కుట్రలో ఓ భారతీయ అధికారి ప్రమేయం ఉన్నట్లుగా అమెరికా న్యాయ అభియోగపత్రాల్లో పేర్కొంది.

Exit mobile version