Parliament Inauguration: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని ప్రారంభం చేయడాన్ని తప్పుబడుతూ.. న్యాయవాది జయ సుకిన్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని కాదని ప్రధాని కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
Read Also: Bandi sanjay: మాకు ఎలాంటి విభేదాలు లేవు.. ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం
ఇదిలా ఉంటే శుక్రవారం సుప్రీంకోర్టు దీనిపై దాఖలైన పిల్ ను కొట్టేసింది. దీంతో ప్రారంభోత్సవానికి మార్గం సుగమం అయింది. పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభ అని ఆర్టికల్ 79 కూడా ఇదే చెబుతోందని, రాష్ట్రపతిని కాదని ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటరీ సెషన్ ప్రారంభంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని తప్పనిసరి చేసే ఆర్టికల్ 87ని కూడా ఇది ప్రస్తావించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని 20కి పైగా పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్, వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్) పార్టీలు ఇందులో ఉన్నాయి. ఇదిలా ఉంటే మాయావతి బీఎస్పీ పార్టీతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ జేడీఎస్ పార్టీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతామని స్పష్టం చేశాయి.