రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 31 వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం ప్రతులను కేంద్రం ప్రవేశపెట్టనున్నది. రాష్ట్రపతి ప్రసంగం తరువాత లోక్‌సభ సమావేశం కాబోతున్నది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభ సమావేశం అవుతంది. తీర్మానం ఆమోదించేందుకు ఉభయసభల్లో చర్చను నిర్వహిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మొత్తం 29 రోజులపాటు నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి.
Read: సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్‌లో తొలికేసు… ఇప్పుడు…
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొత్తం 11 రోజులపాటు తొలివిడత సమావేశాలు జరగనుండగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 19 రోజులపాటు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ప్రతిరోజూ ప్రతీసభ 5 గంటలపాటు జరుగుతుంది. రెండో విడతల్లోనూ సభా కార్యక్రమాల నిర్వహణకు 135 గంటల సమయం కేటాయించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక రాజ్యసభలో జీరోఅవర్‌ను అరగంటపాటు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది.
