PM Modi: లక్ష్యాలెప్పుడూ సులభంగా ఉండకూడదు.. ‘పరీక్షా పే చర్చ’’లో మోడీ సూచన

  • లక్ష్యాలెప్పుడూ సులభంగా ఉండకూడదు
  • బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చట
  • ‘పరీక్షా పే చర్చ’’లో విద్యార్థులకు మోడీ సూచనలు
Modi2

Modi2

లక్ష్యాలెప్పుడూ సులభంగా ఉండకూడదని ప్రధాని మోడీ సూచించారు. ‘పరీక్షా పే చర్చ’’ 9వ సీజన్‌లో భాగంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. గుజరాత్‌, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి, ఢిల్లీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం నింపారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

నైపుణ్యాలు ముఖ్యమా? మార్కులా?
నైపుణ్యాలు ముఖ్యమా? మార్కులా? అని పిల్లలు వేసిన ప్రశ్నకు మోడీ సమాధానం ఇచ్చారు. ప్రతిదానిలోనూ సమతుల్యత అవసరం అని చెప్పారు. రెండు రకాల నైపుణ్యాలు ఉండాలని సూచించారు. నైపుణ్యం జ్ఞానంతో ప్రారంభమవుతుందని.. దీంతో పాటు జీవిత నైపుణ్యాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. నిద్ర, మేల్కొనే సమయం, వ్యాయామం గురించి శ్రద్ధ వహించాలని సలహా ఇచ్చారు. ప్రతి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మోడీ కోరారు.