Site icon NTV Telugu

Paper Leak : ఆ జిల్లాల్లో ఇంటర్‌ పరీక్ష రద్దు..

ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్‌ సెంకట్‌ పాలీ ఇంగ్లీష్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ వెల్లడించింది. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ ఘటన కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేయబడింది. ఇంటర్‌ సెంకడ్‌ ఇయర్‌ ఇంగ్లీష్ పేపర్‌ను మార్కెట్‌లో రూ.500కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్‌.. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేశారు.

పేపర్ లీక్ నివేదిక తర్వాత, యూపీ బోర్డు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ సిరీస్ 316 ఈడీ, 316 ఈఐలను రద్దు చేయాలని నిర్ణయించింది. అధికారుల వర్గాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ పేపర్‌ లీక్‌ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మాధ్యమిక విద్య ఇన్‌ఛార్జ్ మంత్రి గులాబ్ దేవి మాట్లాడుతూ.. “బల్లియాలో 12వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తెలిసింద. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని” అన్నారు.

https://ntvtelugu.com/fuel-price-hike-once-again-india/
Exit mobile version