CJP Protest: అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తాను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలతో జూమ్ సమావేశం నిర్వహించానని, భారత్‌ను ముక్కలు చేస్తే రూ. 10 కోట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు వీడియోలో కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ పతనం అనివార్యమని, మోడీ పదవి నుంచి తప్పుకోవడమే శాశ్వత పరిష్కారం కాదని, భారత్‌ను విచ్ఛన్నం చేయడమే అంతిమ లక్ష్యమని పన్నూన్ అన్నారు.
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తన ఎక్స్ అకౌంట్‌లో వీడియోను షేర్ చేస్తూ ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? దీని వెనక అసలు కుట్ర ఏమిటి? గత 20 రోజుల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో ఎవరెవర్ని కలిశారు.? అని ప్రశ్నించారు. ఈ పరిణామంతో భారత్‌ను అస్థిరపరిచే విదేశీ కుట్రలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని విదేశీ శక్తులు, దేశ వ్యతిరేక వర్గాలు హైజాక్ చేశాయని దూబే ఆరోపించారు.
“ఖలిస్థానీ సంస్థలు, బంగ్లాదేశ్ ఇస్లామిక్ గ్రూపులు, పాకిస్థాన్‌కు చెందిన శక్తులు, సోరోస్ ఫౌండేషన్‌కు అనుబంధ వర్గాలు భారత్‌లో చురుకుగా పనిచేస్తున్నాయి. గతంలో ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు కఠినతరం కావడంతో పరిమితమైన ఈ శక్తులు ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి” అని ఆయన అన్నారు.
पैसे कहॉं से आ रहे हैं? साज़िश क्या है? पिछले 20 दिनों में राहुल गांधी जी विदेश यात्रा में किन किन लोगों से मिले? असली खिलाड़ी कौन? https://t.co/csNggsAtXg
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 22, 2026

