Site icon NTV Telugu

Pani Puri: తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్..?

Pani Puri

Pani Puri

Pani Puri: పానీపూరీ లవర్స్ కు బిగ్ తగిలే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో పానీపూరీని బంద్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పానీపూరీని నిషేదించాలని కర్ణాటక ప్రభుత్వం సైతం భావిస్తుంది. అయితే, కర్ణాటకలో పానీపూరీ తనిఖీల్లో బయటపడిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పానీ కలర్ రావడానికి రసాయనలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. దాదాపు రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్‌లో కృత్రిమ వర్ణద్రవ్యాలు, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.

Read Also: WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ.. తొలిపోరు ఎవరెవరికంటే..?

కాగా, కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారుల సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీ పూరీ షాపుల్లో పుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడులోనూ ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. పానీ పూరీ శాంపుల్స్ ను ల్యాబ్ పంపిన అధికారులు.. రిపోర్టు ఆధారంగా పానీ పూరీని పద్ధతి ప్రకారం బ్యాన్ చేసి అవకాశం ఉంది. అత్యంత ప్రమాణాలతో తయారు చేసే షాపుల్లో తినాలని ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం సూచనలు చేసింది.

Exit mobile version