NTV Telugu Site icon

‘Panauti’ row: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Rahul Gandhi

Rahul Gandhi

‘Panauti’ row: ప్రధాని నరేంద్రమోడీని చెడు శకునంగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌కి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలోర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. చెడుశకునం కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: YSRCP: జనసేనకు బిగ్‌షాక్‌.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు

మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ‘పనౌటీ’ అని పిలిచారు. ‘‘మన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ గెలుచుకున్నారు.. కానీ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసింది’’ అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ నిరాశకు, మానసిక అస్థిరతకు నిదర్శనమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

తన జీవితంలో ఒక్కరోజు కూడా పనిచేయని 55 ఏళ్ల వ్యక్తి, అతని కుటుంబం దశాబ్ధాలుగా భారత్ దేశాన్ని పరాన్న జీవులుగా మారి, అవినీతితో దోపిడి చేసిందని, వారి ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసింది. కాంగ్రెస్ మోసగాళ్లకు, భారత శత్రువులకు, టెర్రరిస్టులకు మోడీ పీడకలగా మారడమే కారణం అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘‘ అతను తన అసలు రంగు చూపించాడు, అతని తల్లి సోనియాగాంధీ అప్పటి ముఖ్యమంత్రి మోదీని ‘మౌత్ కా సౌదాగార్’ అని పిలిచిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా మునిగిపోయిందో గుర్తుంచుకోవాలి’’ అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు.