Pakistan Woman: ‘‘మోడీ గారు మీరే నాకు న్యాయం చేయాలి’’ అని ప్రధాని నరేంద్రమోడీని పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ కోరుతోంది. తన భర్త తనను మోసం చేసి, ఢిల్లీలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్‌దేశ్ అనే మహిళ ప్రధాని మోడీకి వీడియో అప్పీల్ చేసింది. నికితాకు హిందూ సంప్రదాయం ప్రకారం, జనవరి 26, 2020న కరాచీలో విక్రమ్ నాగ్‌దేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పాకిస్తాన్ సంతతికి చెందిన విక్రమ్ దీర్ఘకాలిక వీసాపై ఇండోర్‌లో నివసిస్తున్నాడు. పెళ్లి జరిగిన ఒక నెల తర్వాత, ఫిబ్రవరిలో తనను ఇండియా తీసుకువచ్చాడని, కానీ నెల రోజుల్లోనే తన జీవితం తలకిందులైందని నికితా వీడియోలో చెప్పింది.
వీసా సమస్యలు ఉన్నాయని చెబుతూ జూలై 09, 2020న తనను అట్టారి సరిహద్దు గుండా పాకిస్తాన్‌కు పంపించాడని, అప్పటి నుంచి తనను మళ్లీ ఇండియా తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం లేదని నికితా ఆరోపించింది. తనను భారత్ తీసుకువెళ్లాలని అభ్యర్థిస్తున్నప్పటికీ, విక్రమ్ నిరాకరిస్తూనే ఉన్నాడని చెప్పింది. తనకు న్యాయం చేయకపోతే, మహిళలకు న్యాయంపై నమ్మకం పోతుందని ఆమె అన్నారు. చాలా మంది అమ్మాయిలు గృహహింసకు బలవుతున్నారని ఆమె భాగోద్వేగానికి గురవుతోందని చెప్పారు.
READ ALSO: Tata Sierra Prices: టాటా సియెర్రా వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
తన భర్తకు వారి బంధువుల్లో ఒక అమ్మాయితో సంబంధం ఉందని, ఈ విషయాన్ని తన మామకు చెబితే వివాహేతర సంబంధాల గురించి ఏం చేయలేమని చెప్పారని నికితా ఆరోపించింది. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో తనను బలవంతంగా పాకిస్తాన్ పంపించాడని, ఇప్పుడు భారత్ రావడాన్ని అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పుడు తన భర్త ఢిల్లీ మహిళతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె ఆరోపించింది.
దీనిపై జనవరి 2025లో నికితా ఫిర్యాదు చేసింది. ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టు అధికార పరిధిలోని సింధీ పంచ్ మీడియేషన్ అండ్ లీగల్ కౌన్సిల్ సెంటర్ ముందుకు వచ్చింది. విక్రమ్‌తో పాటు అతడికి కాబోయే భార్యకు నోటీసులు జారీ అయ్యాయి. భార్యభర్తలు భారతీయ పౌరులు కానందున ఇది పాకిస్తాన్ అధికార పరిధిలోకి వస్తుందని, విక్రమ్‌ను పాకిస్తాన్‌కు బహిష్కరించాలని సిఫారసు చేసింది. మే 2025లో నికితా ఇండోర్ సామాజిక పంచాయతీని సంప్రదించింది. ఇది కూడా విక్రమ్‌ను పాకిస్తాన్‌కు బహిష్కరించాలని ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ చెప్పారు.
