NTV Telugu Site icon

tack in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్లాన్.. ఎన్ఐఏ రిపోర్టులో వెల్లడి..

Hyderabad

Hyderabad

Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.

Read Also: Madhya Pradesh: లవ్ ఫెయిల్యూర్.. మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని నర్స్ ఆత్మహత్య..

హైదరాబాద్ లో బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనెడ్స్ విసరాలని పాకిస్తాన్ సూచించినట్లు ముగ్గురు వ్యక్తులపై ఎన్ఐఏ దాఖలు చేసి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సానుభూతిపరులకు హ్యాండ్ గ్రెనేడ్స్ పంపి హైదరాబాద్ నగరంతో ‘‘లోన్ ఊల్ఫ్’’ అటాక్స్ చేయాలని కుట్ర పన్నింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. జనవరి 25న ముగ్గురు హైదరాబాద్ వాసులపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులు మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు బహిరంగ సభలు, ఊరేగింపులపై హ్యాండ్ గ్రెనేడ్లు విసరాలని పాకిస్తాన్ ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

ఐఎస్ఐ, లష్కరేతోయిబా ఆదేశాలపై అబ్దుల్ జాహెద్ అలియాస్ మహ్మద్ నగరంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు యువకులను రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇతరు గతంలో పలు ఉగ్రవాద కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అక్టోబరు 2022లో హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినందుకు మాజ్ హసన్ ఫరూక్, సమీయుద్దీన్‌లపై కూడా ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద అభియోగాలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పోలీసులు అక్టోబర్ 1, 2022 న జాహెద్ ఇంట్లో రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మొబైల్స్ ,రూ. 3,31,800 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఇందులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు ఉండటంతో హో మంత్రిత్వ శాఖ ‘ కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్’ విభాగం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది.

Show comments