NTV Telugu Site icon

Marco rubio: పాకిస్తాన్‌ కష్టం.. ఇండియాకి ఇష్టం.. ట్రంప్ కీలక ఎంపిక..

Trump Rubio

Trump Rubio

Marco rubio: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత, ఆయన కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టారు. తాజాగా భారత్‌కి గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్ట్జ్‌ని జాతీయభద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమించారు. ఇదే విధంగా మరో వ్యక్తి, భారత్‌తో సన్నిహితంగా ఉంటే మార్కో రుబియోని అత్యంత కీలమైన ‘‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’’గా నిమించారు. అయితే, ఈ నియామకాలు ఇండియాకు చాలా కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు.

Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..

ప్రస్తుతం ట్రంప్ ఎంపిక చేసుకున్న ఇద్దరు వ్యక్తులను చూసి పాకిస్తాన్ వణుకుతోంది. ఇద్దరూ కూడా పాకిస్తాన్ అంటేనే కఠినంగా వ్యవహరించే స్వభావం కలిగిన వారు. భారత్‌తో దోస్తీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. ముఖ్యంగా అమెరికా కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్‌(విదేశాంగ మంత్రి)గా మార్కో రుబియోని నియమించడంతో పాక్ ప్రభుత్వం, పాకిస్తానీలు ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ రాజకీయ వ్యాఖ్యాత కమర్ చీమా మాట్లాడుతూ.. రాబోయే కాలం పాకిస్తాన్‌కి ఇబ్బంది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు.

మార్కో చాలా స్పష్టంగా భారత్‌ అనుకూల, పాకిస్తాన్ వ్యతిరేక వ్యక్తి అని చీమా పేర్కొన్నారు. దీంతో రాబోయే కాలంలో అమెరికాలో భారత ప్రాభవం పెరిగి, పాకిస్తాన్ స్థానం బలహీన పడుతుందని చెప్పారు. మార్కో పాకిస్తాన్‌కే కాకుండా, చైనాకు కూడా వ్యతిరేకి అని అన్నారు. హమాస్, గాజాపై దూకుడుగా వ్యవహరిస్తారని, ఇజ్రాయిల్‌కి బేషరతుగా మద్దతు ఇస్తారని, అతడి వైఖరి పాకిస్తాన్‌కి ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఎన్ఎస్ఏ మైక్ వాల్ట్జ్ కూడా పాకిస్తాన్ వ్యతిరేకే అని చీమా అన్నారు. ట్రంప్ పాలనా వైఖరిని బట్టి పాకిస్తాన్ సౌదీ అరేబియా వైపు వెళ్లడం మాత్రమే ఒక్క ఆప్షన్ అని అన్నారు.