Site icon NTV Telugu

Pakistan: “సిందూర్” దాడుల్ని పరదాలతో కప్పుతున్న పాకిస్తాన్..

Pakistan

Pakistan

Pakistan: ఆపరేషన్ సిందూర్ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో సమాధానం చెప్పింది. ముందుగా, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసింది. అయితే, దీని తర్వాత పాక్ సైన్యం, భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేసింది. ఈ సారి భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు జరిపింది. మొత్తం 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను తీవ్రంగా దెబ్బతీసింది.

Read Also: S Jaishankar: పాకిస్తాన్‌లో బిన్ లాడెన్ ఎలా సురక్షితంగా ఉన్నాడు.. వెస్ట్రన్ దేశాలకు క్లాస్ తీసుకున్న జైశంకర్..

అయితే, ఈ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు పాకిస్తాన్ దాడులతో దెబ్బతిన్న ప్రాంతాలను టార్పలిన్ కవర్లతో కప్పుతోంది. మురిద్, జకోబాబాద్, భోలారి ఎయిర్‌బేస్‌లో దెబ్బతిన్న ప్రాంతాను టార్పిలిన్లలో కప్పిన దృశ్యాలు శాటిలైట్ ఇమేజ్‌లలో కనిపించాయి. సింధ్‌లోని భోలారి ఎయిర్ బేస్‌లో దెబ్బతిన్న హ్యాంగర్‌ని కప్పినట్లు శాటిలైట్ ఫోటోలు చూపించాయి. ఈ ఫోటోలను ముందుగా జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ గుర్తించారు. మురిద్ ఎయిర్ బేస్ వద్ద క్షిపణి దాడితో ఏర్పడిన 3 మీటర్ల వెడల్పు కలిగిన బిలాన్ని కాన్వాస్‌తో కప్పి ఉంచారు.

Exit mobile version