Pakistan: రగులుతున్న పాకిస్తాన్.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్..
- రగిలిపోతున్న పాకిస్తాన్..
- రాజధాని ఇస్లామాబాద్‌కి పోటెత్తిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు..
- ఘర్షణల్లో కనీసం నలుగురు మృతి..
- ఆర్మీకి ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్స్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్‌కి చేరుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించాడు. ఇదిలా ఉంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది.
Read Also: Crime: బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతి దారుణహత్య.. రోజంతా శవంతోనే నిందితుడు..
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
పాకిస్తాన్ ఆర్మీకి సెక్షన్ 245 ప్రకారం ‘‘షూట్ అట్ సైట్’’ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆందోళనకారులు కనిపిస్తే కాల్చేయాలనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సాయుధ దళాలకు ‘‘బాహ్యదురాక్రమణ లేదా యుద్ధ ముప్పు నుంచి పాకిస్తాన్‌ని రక్షించడానికి’’ ఉద్దేశించిన నిబంధన. ఇది న్యాయ జోక్యం లేకుండా సైన్యానికి అపరిమిత అధికారాలను ఇస్తుంది. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. ఎవరిని విడిచిపెట్టొద్దని పాక్ ఆర్మీ తన సైనికులకు సూచించినట్లు పేర్కొంది.
పాకిస్తాన్‌లో నిరసనకారులు పోలీసులు హెచ్చరికల్ని ధిక్కరించి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు కర్రలు, రాళ్లతో ఇస్లామాబాద్ వీధుల్లోకి వచ్చారు. ఇస్లామాబాద్ శనివారం నుండి లాక్‌డౌన్లో ఉంది. రోడ్లపై అడ్డంగా కంటైనర్లను ఉంచారు. వేల సంఖ్యలో పోలీసులు, సైన్యం మోహరించింది. ఇంటర్నెట్ ని కట్ చేశారు. ఇస్లామాబాద్‌లో రెండు నెలల పాటు అన్ని బహిరంగ సభల్ని ప్రభుత్వం నిషేధించింది.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!