NTV Telugu Site icon

Pakistan: రగులుతున్న పాకిస్తాన్.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై ‘‘షూట్ అట్ సైట్’’ ఆర్డర్..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్‌కి చేరుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించాడు. ఇదిలా ఉంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది.

Read Also: Crime: బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతి దారుణహత్య.. రోజంతా శవంతోనే నిందితుడు..

పాకిస్తాన్ ఆర్మీకి సెక్షన్ 245 ప్రకారం ‘‘షూట్ అట్ సైట్’’ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆందోళనకారులు కనిపిస్తే కాల్చేయాలనే ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సాయుధ దళాలకు ‘‘బాహ్యదురాక్రమణ లేదా యుద్ధ ముప్పు నుంచి పాకిస్తాన్‌ని రక్షించడానికి’’ ఉద్దేశించిన నిబంధన. ఇది న్యాయ జోక్యం లేకుండా సైన్యానికి అపరిమిత అధికారాలను ఇస్తుంది. పాకిస్తాన్ మీడియా ప్రకారం.. ఎవరిని విడిచిపెట్టొద్దని పాక్ ఆర్మీ తన సైనికులకు సూచించినట్లు పేర్కొంది.

పాకిస్తాన్‌లో నిరసనకారులు పోలీసులు హెచ్చరికల్ని ధిక్కరించి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు కర్రలు, రాళ్లతో ఇస్లామాబాద్ వీధుల్లోకి వచ్చారు. ఇస్లామాబాద్ శనివారం నుండి లాక్‌డౌన్లో ఉంది. రోడ్లపై అడ్డంగా కంటైనర్లను ఉంచారు. వేల సంఖ్యలో పోలీసులు, సైన్యం మోహరించింది. ఇంటర్నెట్ ని కట్ చేశారు. ఇస్లామాబాద్‌లో రెండు నెలల పాటు అన్ని బహిరంగ సభల్ని ప్రభుత్వం నిషేధించింది.