Site icon NTV Telugu

Pakistan: భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. మరోసారి పాక్ ఆరోపణలు..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ వరసగా దాడులకు గురవుతోంది. ముఖ్యంగా బలూచిస్తాన్‌లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ ఆర్మీపై దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల క్రితం, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసి, 200 మందికి పైగా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందిని హతం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా బీఎల్ఏ విరుచుకుపడింది. ఈ ఘటనలో 90 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అటు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాక్ తాలిబన్లు తీవ్రంగా దాడులు చేస్తున్నారు.

Read Also: Disha Salian: దిశా సాలియన్ ఎవరు..? హత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఏమిటి..?

ఈ నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ ప్రేమయం ఉందని ఆరోపణలు చేస్తోంది. పాకిస్తాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, తమ దేశాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నిస్తోంది అక్కడి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘‘ఇది చాలా స్పష్టంగా ఉంది. భారత్ తమ దేశంలో హత్యలను స్పాన్సర్ చేస్తోంది’’ అని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ అన్నారు. “భారత ప్రమేయం స్పష్టంగా ఉంది. వారు పాకిస్తాన్‌లో ఉగ్రవాదంలో పాలుపంచుకున్నారు. రెండవది, ఇది కేవలం పాకిస్తాన్‌ను మాత్రమే కాదు, వారు మొత్తం ప్రాంతాన్ని, అన్ని దక్షిణాసియా దేశాలను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆరోపించాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో,బలూచిస్తాన్‌ను అస్థిరపరచడంలో భారత ప్రేమేయం ఉందని మాకు తెలుసు అని అన్నారు.

మరోసారి పాక్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ శాంతియుత సహజీవనాన్ని విశ్వసిస్తుందని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి అన్నారు. దక్షిణాసియాలో శాశ్వత శాంతికి, సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు మరియు కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారం చాలా అవసరం అని అన్నారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఘటనను భారత్ ఎందుకు ఖండించలేదని షఫ్కత్ అలీ ఖాన్ ప్రశ్నించారు.

Exit mobile version