Site icon NTV Telugu

IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..

Indigo

Indigo

IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్‌కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్‌కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్‌ని ఎదుర్కొంది.

అయితే, ప్రమాదకర పరిస్థితుల్లో వడగళ్ల వానను తప్పించుకునేందు, అంతర్జాతీయ సరిహద్దు దాటి, పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లేందుకు లాహోర్ ఏటీసీని అనుమతి ఇవ్వాలని పైలట్ అభ్యర్థించినా, పాకిస్తాన్ ఇందుకు ఒప్పుకోలేదని ఏవియేషన్ వాచ్‌డాగ్ DGCA శుక్రవారం తెలిపింది. ఈ ఘటన తర్వాత, విమానాన్ని పైలట్ సురక్షితంగా శ్రీనగర్ చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీనిని బట్టి చూస్తే విమానం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.

Read Also: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు

ప్రస్తుతం, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపింది. అయితే, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా, పాకిస్తాన్ మానవతా దృక్పథంతో స్పందించలేదని నెటిజన్లు తిడుతున్నారు. పాకిస్తాన్‌ని భారత్ సింధు జలాలను ఆపడంలో తప్పు లేదని పోస్టులు పెడుతున్నారు.

ఇటీవల, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్‌ 80 శాతం వ్యవసాయం ఈ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఉగ్రవాద దాడి తర్వాత చీనాబ్ నది నీటిని భారత్ అడ్డుకుంది.

Exit mobile version