IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
- ప్రమాదకర వాతావరణంలో చిక్కుకున్న ఇండిగో ఫ్లైట్..
- ఎయిర్‌స్పేస్ ఇవ్వడానికి నిరాకరించిన పాకిస్తాన్..
- పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పు లేదంటున్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్‌కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్‌కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్‌ని ఎదుర్కొంది.
అయితే, ప్రమాదకర పరిస్థితుల్లో వడగళ్ల వానను తప్పించుకునేందు, అంతర్జాతీయ సరిహద్దు దాటి, పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లేందుకు లాహోర్ ఏటీసీని అనుమతి ఇవ్వాలని పైలట్ అభ్యర్థించినా, పాకిస్తాన్ ఇందుకు ఒప్పుకోలేదని ఏవియేషన్ వాచ్డాగ్ DGCA శుక్రవారం తెలిపింది. ఈ ఘటన తర్వాత, విమానాన్ని పైలట్ సురక్షితంగా శ్రీనగర్ చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ముక్కు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీనిని బట్టి చూస్తే విమానం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
Read Also: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
ప్రస్తుతం, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపింది. అయితే, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా, పాకిస్తాన్ మానవతా దృక్పథంతో స్పందించలేదని నెటిజన్లు తిడుతున్నారు. పాకిస్తాన్‌ని భారత్ సింధు జలాలను ఆపడంలో తప్పు లేదని పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ 80 శాతం వ్యవసాయం ఈ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఉగ్రవాద దాడి తర్వాత చీనాబ్ నది నీటిని భారత్ అడ్డుకుంది.
#Pakistan once again showed it's real face.
Lahore ATC denied passage to Indigo Flight which was carrying 200 Passengers.
Bad weather & Turbulence put lives on threat.Well u can not expect more from a #TerrorState.#IndiGoFlight #PlaneCrash #Bitcoin #GTvLSG #viralvideo pic.twitter.com/6NtkJAlghO
— Sunaina Bhola (@sunaina_bhola) May 23, 2025
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!