Hardeep Singh Nijjar: కెనడాలో పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి హత్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాది, గతేడాడి హత్యచేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్న పాకిస్తాన్ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించారు. సర్రే నగరంలో నిజ్జర్ హత్య తర్వాత మొదలైన నిరసనల్లో పాకిస్తాన్ సంతతి వ్యక్తి రాహత్‌రావు ప్రమేయం ఉంది. శుక్రవారం 24-25 ఏల్ల వ్యక్తి రాహత్‌రావుకి నిప్పంటించాడు. ఆస్పత్రికి చేరే సమయంలోనే అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకరాం.. రావు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) యొక్క ఏజెంట్ కాదని తెలుస్తోంది.
రావ్‌కి నిప్పటించిన నిందితుడి ఫోటోని కెనడా పోలీసులు విడుదల చేవారు. రావ్ కెనడాలో చాలా చురుకుగా ఉన్నాడు. గతేదాడి నిజ్జర్ మరణం తర్వాత అనేక నిరసనల్లో పాల్గొన్నాడు. గత ఏడాది జూన్ 18న సర్రేలోని గురుద్వారా బయట నిజ్జర్‌ను కాల్చి చంపారు. భారతదేశం విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో ఇతని పేరు కూడా ఉంది. ఈ హత్య తర్వాత కెనడా, భారత్ మధ్య తీవ్ర దౌత్యయుద్ధం జరిగింది.
స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే, భారత్ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ట్రూడోవి అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టి పారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలుస్తోందని చెప్పారు. నిజ్జర్ హత్యపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (RCMP) దర్యాప్తు చేస్తున్నారు.