Site icon NTV Telugu

పంజాబ్ సరిహద్దుల్లో పాక్ బెలూన్ల క‌ల‌క‌లం…

ఆగ‌స్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటే, ఆగ‌స్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకున్న‌ది.  ఈ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి.  అసేతు హిమాచ‌లం మొత్తం ఈ వేడుక‌ల్లో పాల్గొన్న‌ది. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల స‌మ‌యంలో ఇండియా పాక్ స‌రిహ‌ద్దుల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.  నిఘాను, భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేస్తారు.  ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్‌లోని రూప్‌న‌గ‌ర్ జిల్లా స‌నోడా గ్రామంలో పంట‌పొలాల్లో పాక్ బెలూన్లు క‌నిపించాయి.  ఐ ల‌వ్ పాక్ అనే స్లోగ‌న్‌తో కూడిన బెలూన్లు క‌నిపించ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  పాక్ వైపునుంచే ఈ బెలూన్లు వ‌చ్చి ఉంటాయ‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  దీనిపై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Read: ఎయిర్‌లిఫ్ట్‌: ఆర్మీ కాల్పులు… ఎయిర్‌పోర్ట్‌లో హైటెన్ష‌న్‌.

Exit mobile version