Site icon NTV Telugu

Pahalgam Terror Attack: ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేయడం సహజం: ఎన్ఐఏ వర్గాలు..

Pahalgam Zip Line Operator

Pahalgam Zip Line Operator

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. టూరిస్టులు రీల్స్ చేస్తున్న సమయంలో కొందరి మొబైల్‌లో ముష్కరుల దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తాజాగా, జిప్ లైనర్‌పై వెళ్తున్న ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియోలో కూడా టెర్రరిస్టుల దాడి రికార్డ్ అయింది. అయితే, దీనికి ముందు జిప్‌ లైన్ ఆపరేటర్ చేసిన ‘‘ అల్లాహు అక్బర్’’ నినాదాలు సంచలనంగా మారాయి. ఆపరేటర్ ముజమ్మిల్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Read Also: BJP vs Congress: ‘‘కాంగ్రెస్‌కి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు’’.. బీజేపీ విమర్శలు..

వీడియోలో ముజమ్మిల్ 3 సార్లు ‘అల్లా హు అక్బర్’ అనడం అదే సమయంలో కాల్పులు శబ్ధాలు వినిపించడం టూరిస్ట్ రిషి భట్ సెల్‌ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. ఆపరేటర్ అల్లాహు అక్భర్ అని చెప్పాడని, ఆపై కాల్పులు ప్రారంభమయ్యాని భట్ ఆరోపించారు. దీంతో అతను కూడా జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విచారణ పరిధిలోకి వచ్చాడు.

అయితే, ముజమ్మిల్‌ని ఎన్ఐఏ విచారిస్తోంది. దిగ్భ్రాంతికరమైన లేదా ఆకస్మికమైన దానికి ప్రతిస్పందనగా ‘అల్లా హు అక్బర్’ అని చెప్పడం సహజమని, హిందువులు ‘హే రామ్’ అని దేవుడిని తలుచుకోవడం లాంటిదే అని ఎన్ఐఏ వర్గాలు చెప్పినట్లు సమాచారం. అయితే, కాల్పులు ప్రారంభమైన తర్వాత జిప్ లైన్ ఆపరేటర్ రిషి భట్‌ని జిప్‌లో ఎందుకు రిలీజ్ చేశాడని అడిగినప్పుడు, అతను తన స్టే్ట్మెంట్స్ మార్చినట్లు తెలుస్తోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) ప్రతినిధి మొహమ్మద్ ఇక్బాల్ ట్రంబూ మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనల సమయంలో కాశ్మీరీలు ‘‘అల్లా’’ను స్మరించుకోవడం సాధారణమే అని అన్నారు.

Exit mobile version