Site icon NTV Telugu

Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!

Mahadevoperation

Mahadevoperation

ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు. 26 మందిని చంపిన నరహంతకులు. యుద్ధంలో ఆరితేరిన వారు. అధునాతన ఆయుధాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు. అలాంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం మామూలు విషయం కాదు. ఎంతో ప్రణాళిక ఉండాలి. ఎన్నో జాగ్రత్తలు ఉండాలి. అలాంటి ఆపరేషనే మహదేవ్ ఆపరేషన్. భారత సైన్యం ఎలా చేపట్టింది. ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులను మతం పేరుతో 26 మందిని ముష్కరులు చంపేశారు. ఆనాటి నుంచి ఉగ్రవాదుల కోసం సైన్యం వేటాడుతోంది. ఇంకోవైపు దర్యాప్తు సంస్థలు కూడా నిఘా పెట్టాయి. ఉగ్రవాదులు మాత్రం భారత్‌లోనే ఉన్నట్లుగా ఒక క్లారిటీకి వచ్చారు. అంతేకాకుండా స్థానికుల సహాయంతో అన్ని వసతులు పొందుతున్నట్లుగా కనిపెట్టారు. దీంతో నిఘా సంస్థలు పక్కా ప్రణాళికతో కనిపెడుతున్నాయి. ఉగ్రవాదులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఇద్దరు స్థానికుల్ని పట్టుకున్నారు. అన్ని విషయాలు ఆరా తీశారు.

ఇది కూడా చదవండి: Israel-Iran: మళ్లీ వార్నింగ్‌లు.. బెదిరింపులు ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామన్న ఇజ్రాయెల్

ఇక 14 రోజుల నుంచి అనుమానాస్పద సంభాషణ జరుగుతున్నట్లుగా సైన్యం కనిపెట్టింది. ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని మహాదేవ్ దట్టమైన అడవిలో ఉన్నట్లుగా కనిపెట్టింది. మహదేవ్ శిఖరం దిగువ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో దాక్కుకున్నట్లు గుర్తించారు. దీంతో అదే ప్రాంతంలో సంచార జాతుల వారిని నిఘా పెట్టాయి. అలాగే ఎలక్ట్రానిక్ నిఘా కూడా పెట్టాయి. చైనా అల్ట్రా రేడియో కమ్యూనికేషన్ యాక్టివ్‌గా ఉందని బలగాలకు క్లూ అందింది. లష్కరే తోయిబా ఎన్‌క్రిప్ట్ సందేశాల కోసం చైనీస్ రేడియోను ఉపయోగిస్తున్నట్లుగా కనిపెట్టింది.

ఇది కూడా చదవండి: Pahalgam Terrorists: పహల్గామ్ ఉగ్రవాదులు హతం.. వెలుగులోకి ఫొటోలు

శిఖరం ఏమో ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఉగ్రవాదులేమో దట్టమైన అడవిలో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఉగ్రవాదులు అడవి యుద్ధంలో శిక్షణ పొందినవారు. ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేపట్టాలి. అంతే సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా ప్రణాళికతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆపరేషన్‌కు మహదేవ్ అని నామకరణం చేసి దిగింది. ఒకచోట తాత్కాలిక డేరా వేసుకుని ఉన్నట్లు కనబడింది. అంతే అమాంతంగా సైన్యం కాల్పులకు దిగింది. అక్కడికక్కడే పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ మూసా సహా మరో ఇద్దరు హతమయ్యారు.

ఇక ఉగ్రవాదులు హతమైన చోట అనేకమైన ఏకే-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్‌లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైన్యం స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ముగ్గురు మరోసారి పహల్గామ్‌లో చేపట్టినట్లుగానే జమ్మూకాశ్మీర్‌లో మరో దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా భద్రతా దళాలు అనుమానించాయి. అందుకోసమే ఆ స్థాయిలో ఆయుధాలు భద్రం చేసుకున్నట్లుగా సమాచారం.

Exit mobile version