Site icon NTV Telugu

PM Modi: ఎవరెన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్‌ అభివృద్ధిని ఆపలేరు..

Modi

Modi

PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తొలిసారి కాశ్మీర్‌ లోయలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్‌ పురోగతికి ప్రతిబింబమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కాశ్మీర్‌లో అభివృద్ధిని ఆపలేరని పేర్కొన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సింధూర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. పాకిస్తాన్ పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం.. మన టూరిజాన్ని దెబ్బ తీసి పేదల పొట్ట గొట్టాలని ప్రయత్నిస్తుంది.. ఆదిల్‌ హుస్సేన్‌ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీ వాలా.. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడేవాడు.. ఆ రోజు టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడాడు.. కానీ, చివరకు అతడ్ని కూడా ఉగ్రవాదులు చంపేశారని ప్రధాని మోడీ మండిపడ్డారు.

Read Also: YS Jagan: “అధైర్య పడొద్దు”.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్…

ఇక, ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కాశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు.. అమాయక ప్రజలను చంపడంతోనే.. ప్రతీకారంగా ఆపరేషన్‌ సింధూర్‌తో మన శక్తి ఏంటో పాకిస్తాన్ కు చూపించామని వెల్లడించారు. సరిగ్గా నెల రోజుల క్రితం పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం.. పురుడు దేశం నాయకత్వానికి నిద్ర లేకుండా చేశామని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకోలేదని నరేంద్ర మోడీ తెలిపారు.

Exit mobile version