Site icon NTV Telugu

Ozempic: ఇండియాలో డయాబెటిస్ సూపర్ డ్రగ్ ‘ఒజెంపిక్’ లాంచ్.. ధర, ఎలా వాడాలంటే.

Ozempic

Ozempic

Ozempic: డెన్మార్క్ ఔషధ తయారీదారు ‘‘నోవో నార్డిస్క్(Novo Nordisk)’’ భారతదేశంలో తన ప్రతిష్టాత్మక డయాబెటిస్ డ్రగ్ ‘‘ఒజెంపిక్’’(Ozempic)ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటోంది. HbA1c 7 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పెద్దలకు ఈ మందు అనుకూలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, రిస్క్ ఎక్కువగా ఉన్న పెద్దలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించే ప్రభావం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడనుంది.

Read Also: Messi Match: మెస్సీ ఫుట్‌బాల్‌ ఈవెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత.. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్‌లతో నిఘా

ఒజెంపిక్‌లో సెమాగ్లటైడ్(Semaglutide) అనే హార్మోన్ ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. దీనిని వారానికి ఒకటి, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 2,200గా ఉంది. భారతదేశంలో స్థూలకాయం పెరుగుతోంది. 25.4 కోట్ల మంది స్థూలకాంలో బాధపడుతుంటేన 35.1 కోట్ల మంది పొట్ట చుట్టూ కొవ్వుతో హెల్త్ రిస్క్ ఎదుర్కొంటున్నారు. దీంతోనే భారతదేశంలో GLP-1 మందులకు భారీ డిమాండ్ ఏర్పడింది.

భారతదేశంలో GLP-1 మందుల మార్కెట్‌లో యూఎస్‌కు చెందిన ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన మౌంజారో (Mounjaro) దూసుకుపోతోంది. ఇండియాలో మొదట ప్రారంభమైన GLP మందు కావడంతో మార్కెట్‌ను పట్టుకుంది. అక్టోబర్, నవంబర్లలో దీని సేల్స్ రూ. 100 కోట్లను దాటింది. మార్కెట్ షేర్ 86-91 శాతం ఉంది. మరోవైపు, నోవో నార్డిస్క్ నవంబర్ నెలలో వెగోవీ(Wegovy) ధరల్ని తగ్గించడంతో ఈ మార్కెట్‌లో మరింత పోటీకి తెరతీసింది. GLP-1 మార్కెట్‌లో వెగోవీ వాటా అక్టోబర్‌లో 9 శాతం నుండి నవంబర్‌లో 14 శాతానికి పెరిగింది, అదే సమయంలో మౌంజారో వాటా 91 శాతం నుండి 86 శాతానికి తగ్గింది. ఎలీ లిల్లీ, నోవో నార్డిస్క్ రెండు సంస్థలు కూడా నగరాల నుంచి తన ఇతర ప్రాంతాలకు తమ మార్కెట్‌ను విస్తరించేందుకు సిప్లా, ఎంక్యూర్ వంటి భారతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నాయి.

Exit mobile version