Ozempic: ఇండియాలో డయాబెటిస్ సూపర్ డ్రగ్ ‘ఒజెంపిక్’ లాంచ్.. ధర, ఎలా వాడాలంటే.
- ఇండియాలో డయాబెటిక్ డ్రగ్ ఒజెంపిక్ లాంచ్..
- దేశంలో పెరిగిన GLP-1 డ్రగ్ మార్కెట్..
- మౌంజారో ఆధిపత్యాన్ని సవాల్ చేయనున్న ఒజెంపిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ozempic: డెన్మార్క్ ఔషధ తయారీదారు ‘‘నోవో నార్డిస్క్(Novo Nordisk)’’ భారతదేశంలో తన ప్రతిష్టాత్మక డయాబెటిస్ డ్రగ్ ‘‘ఒజెంపిక్’’(Ozempic)ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటోంది. HbA1c 7 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పెద్దలకు ఈ మందు అనుకూలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, రిస్క్ ఎక్కువగా ఉన్న పెద్దలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించే ప్రభావం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడనుంది.
Read Also: Messi Match: మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్‌కు కట్టుదిట్టమైన భద్రత.. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్‌లతో నిఘా
Also Read
ఒజెంపిక్‌లో సెమాగ్లటైడ్(Semaglutide) అనే హార్మోన్ ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. దీనిని వారానికి ఒకటి, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 2,200గా ఉంది. భారతదేశంలో స్థూలకాయం పెరుగుతోంది. 25.4 కోట్ల మంది స్థూలకాంలో బాధపడుతుంటేన 35.1 కోట్ల మంది పొట్ట చుట్టూ కొవ్వుతో హెల్త్ రిస్క్ ఎదుర్కొంటున్నారు. దీంతోనే భారతదేశంలో GLP-1 మందులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
భారతదేశంలో GLP-1 మందుల మార్కెట్‌లో యూఎస్‌కు చెందిన ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన మౌంజారో (Mounjaro) దూసుకుపోతోంది. ఇండియాలో మొదట ప్రారంభమైన GLP మందు కావడంతో మార్కెట్‌ను పట్టుకుంది. అక్టోబర్, నవంబర్లలో దీని సేల్స్ రూ. 100 కోట్లను దాటింది. మార్కెట్ షేర్ 86-91 శాతం ఉంది. మరోవైపు, నోవో నార్డిస్క్ నవంబర్ నెలలో వెగోవీ(Wegovy) ధరల్ని తగ్గించడంతో ఈ మార్కెట్‌లో మరింత పోటీకి తెరతీసింది. GLP-1 మార్కెట్‌లో వెగోవీ వాటా అక్టోబర్‌లో 9 శాతం నుండి నవంబర్‌లో 14 శాతానికి పెరిగింది, అదే సమయంలో మౌంజారో వాటా 91 శాతం నుండి 86 శాతానికి తగ్గింది. ఎలీ లిల్లీ, నోవో నార్డిస్క్ రెండు సంస్థలు కూడా నగరాల నుంచి తన ఇతర ప్రాంతాలకు తమ మార్కెట్‌ను విస్తరించేందుకు సిప్లా, ఎంక్యూర్ వంటి భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నాయి.
తాజావార్తలు
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!