NTV Telugu Site icon

Asaduddin Owaisi: అద్వానీకి భారతరత్నపై స్పందించిన ఓవైసీ.. రథయాత్ర మ్యాప్‌ని పోస్ట్ చేస్తూ..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి ఈ రోజు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించింది. అయితే, నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని ఎగతాళి చేశారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘‘ ఎల్‌కే అద్వానీకి భారతరత్న దక్కింది. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేదీ కాదు’’ అని ఆయన ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 23, 1990 నుంచి నవంబర్ 5, 1990 వరకు జరిగిన అద్వానీ రథయాత్రలో మ్యాప్‌ని పోస్టులో జత చేశారు.

Read Also: Delhi: కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ కౌంటర్

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతుగా ఎల్‌కే అద్వానీ రథయాత్రను ప్రారంభించారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమై అయోధ్యంలో ముగిసింది. ఊరేగింపు మార్గాల్లో అనేక ప్రతిఘటనలు, హింస చోటు చేసుకున్నాయి. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ అద్వానీకి భారతరత్న ప్రకటిస్తూ..‘‘ మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఒకరు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పని చేయడం నుండి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అతని జీవితం సాగింది’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.