Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థతో అస్సాం రైఫిల్స్ సెమినార్
- గౌహతిలో భారత్-మయన్మార్ సరిహద్దు భద్రతపై చర్చ
- భద్రతా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ ప్రభావమా? అంటూ ఒవైసీ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) అనుబంధ సంస్థతో అస్సాం రైఫిల్స్ కలిసి నిర్వహించి ఒక సెమినార్ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. భారత భద్రతా వ్యవస్థపై అధికార పార్టీ సిద్ధాంతం ప్రభావం చూపుతోందా.? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ను బీజేపీ మాతృసంస్థగా భావిస్తారు. అస్సాం రైఫిల్స్ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అంతర్గత భద్రత, సరిహద్దును నిర్వహిస్తోంది.
జూన్ 17, 18 తేదీల్లో గౌహతిలో ‘భారత్-మయన్మార్ సరిహద్దు సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణ’ అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని అస్సాం రైఫిల్స్‌తో పాటు సీమంత్ చేతనా మంచ్-నార్త్ ఈస్ట్ సంయుక్తంగా నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సీమంత్ చేతనా మంచ్ తనను తాను ఒక సామాజిక, సాంస్కృతిక, రాజకీయేతర సంస్థగా పేర్కొన్నప్పటికీ, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ లేదా దాని భావజాలానికి దగ్గరగా ఉన్న సంస్థగా భావిస్తుంటారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఈ సెమినార్‌పై ఓవైసీ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తో రాష్ట్ర భద్రతా దళాల మధ్య పెరుగుతున్న సమన్వయం భారత భద్రతా వ్యవస్థను, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోందనే అనుమానాలకు తావిస్తోంది’’ అని ఆయన ఎక్స్‌లో అన్నారు. ఈ సెమినార్‌కు నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు దేశాలను విభజించవు, అదే దేశ భద్రతను, గుర్తింపును నిర్వచిస్తాయి అని అన్నారు.
The convergence between RSS, the ideological mothership of the political party in power, Bhartiya Janta Party and state security forces, is a marker of what potentially influences India’s security apparatus and thinking. https://t.co/Z7X538cGik
— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2026
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!