NTV Telugu Site icon

Manipur: మణిపూర్లో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం 2,000 మందితో గాలింపు..

Manipur

Manipur

Manipur: మణిపూర్ రాష్ట్రంలో గత నవంబర్ 25 నుంచి తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం దాదాపు 2,000 మంది విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక, లీమాఖోంగ్ ఆర్మీ క్యాంపు నుంచి లైష్రామ్ కమల్ (56) అదృశ్యంపై విచారణ జరిపేందుకు మణిపూర్ హైకోర్టు జస్టిస్ డి కృష్ణకుమార్, గోల్మీ గైఫుల్‌షిల్లులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం డిసెంబర్ 3న ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Read Also: Deputy CM Pawan Kalyan: నేడు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన..

కాగా, ఈ కేసులో విచారణ అధికారికి 2/8 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ యాదవ్‌ను నామినేట్ చేశారు. ఈ కమిటీ స్పాట్ విచారణ జరిపి డిసెంబర్ 18వ తేదీన నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. తదుపరి విచారణ కోసం సీసీటీవీ ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని కమిటి పేర్కొంది. లైష్‌రామ్‌ కూడా ఉపయోగించిన తప్పిపోయిన వాహనం జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి కేసుపై స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు దాఖలు చేయాలని మణిపూర్ ఉన్నత న్యాయస్థానం కమిటీని ఆదేశించింది.

Show comments