NTV Telugu Site icon

PM Narendra Modi: అభివృద్దే మా ప్రాధాన్యత.. ఓటు బ్యాంకు రాజకీయాలు కావు..

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: మా ప్రాధాన్యత అభివృద్ది, ఓటు బ్యాంకు రాజకీయాలు కావని ప్రధాని నరేంద్రమోదీ గురువారం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు, రాజకీయా పార్టీలు రోడ్డు, విద్యుత్, నీటి సదుపాయాల కోసం పనిచేయకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవని విమర్శించారు. గురువారం, ప్రధాని మోదీ కర్ణాటకలోని కోడెకల్ జిల్లాలో సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

Read Also: Gopichand Malineni: శృతి హాసన్ తో ఎఫైర్.. గోపీచంద్ ఏమన్నాడంటే..?

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి సురక్షితమైన, తగినంత తాగు నీరు అందిచాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ పథకానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ పథకం కిందన 117 ఎంఎల్డీ నీటిశుద్ధి ప్లాంట్లను నిర్మించనున్నారు.

జల్ జీవన్ మిషన్ 3.5 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, అంతకుముందు దేశంలో 18 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే కుళాయి సదుపాయం ఉందేదని.. ఇప్పుడు దేశంలో 11 కోట్ల గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటిని పొందుతున్నాయిని ప్రధాని మోదీ వెల్లడించారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన జిల్లాల్లో అభివృద్ధి, సుపరిపాలన తీసుకువచ్చామని ఆయన అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 224 అసెంబ్లీ సీట్లలో 150 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.