P. Saravanan: కాషాయ పార్టీలో ఊహించని ట్విస్ట్.. మంత్రి శరవణన్ బీజేపీకి బై.. బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మదురై బీజేపీలో కలకలం రేగింది. మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై చెప్పు విసిరిన వ్యవహారం చర్చకు దారితీసింది. దీంతో.. మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్ర మనస్తాపంతో పార్టీకి బై..బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలో.. మంత్రితో భేటీ కావడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో మదురై నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. అయినా కూడా.. బీజేపీ పెద్దలు ఆయనకు మదురై నగర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఈనేపథ్యంలో.. డీఎంకేపై ఇన్నాళ్లు విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతూ వచ్చిన శరవణన్‌కు శనివారం ఆయన తుది నిర్ణయం ప్రకటించారు.
అయితే.. ముష్కరుల దాడిలో అమరుడైన ఆర్మీ జవాన్ లక్ష్మణన్‌కు మదురై విమానాశ్రయంలో మంత్రి పళని వేల్ త్యాగరాజన్ శనివారం నివాళులర్పించిన విషయం తెలిసిందే. దీంతో.. బయటకు వెళ్తున్న సమయంలో ఆయన వాహనంపై బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు దీంతో.. చెప్పు విసరడంతో పోలీసులు రంగంలోకి దిగి, బీజేపీ నాయకులు ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటనను మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్రంగా పరిగణించి, మంత్రికి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు. కాగా.. అర్ధరాత్రి వేళ మంత్రిని కలిసిసారి చెప్పడమే కాకుండా, బీజేపీ మతతత్వ పార్టీ అని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తనను బాగా కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. బీజేపీ చర్యలను ఖండిస్తూ ఆ పార్టీ నుంచి వైదొలగనున్నానని శరవణన్ ప్రకటించారు. నిన్న ఆదివారం ఉదయాన్నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శరవణన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. దీనిపై శరవణన్ స్పందిస్తూ డీఎంకే తన మాతృ సంస్థ అని అయితే, ఇక డాక్టర్ వృత్తిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
Bandi Sanjay : బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!